గవర్నమెంట్ స్కూల్ ముద్దు ప్రైవేట్ స్కూల్ వద్దు గ్రామ సర్పంచ్ రోహిత్ గౌడ్
ఇందల్వాయి ( జనం సాక్షి) జూన్. 13 ఇందల్వాయి మండల కేంద్రంలో డోన్కల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ రోహిత్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రవేట్ స్కూల్ వద్దు గవర్నమెంట్ స్కూల్ ముద్దు అనే నినాదంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని తండాలు కాలనీలలో తిరుగుతూ గ్రామ ప్రజలకు ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సంక్షేమ సదుపాయాలు అందుతున్నాయని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఆయన కోరారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదివించడం వల్ల పేద మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం సర్పంచ్ రోహిత్ గౌడ్ మాట్లాడుతూ మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాఠశాలలోనే పిల్లలను చదివించడం ఎంతో గొప్ప విషయం ప్రభుత్వ పాఠశాలలో నైపుణ్యత మైన ఉపాధ్యాయులు మెరుగైన వసతులు విద్యార్థుల అభివృద్ధికి అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి అందువల్ల ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలను ఆదరించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ యువకులు తల్లిదండ్రులు వీడీసీ సభ్యులు ప్రతి ఒక్కరు పాల్గొన్నారు.



