కేటీఆర్ కు ఇక్కడి ప్రాంత ప్రజలను ఓటు హక్కు అడిగే అర్హత లేదు.

_కాంగ్రెస్ మండల అధ్యక్షులు హమీద్

గంభీరావుపేట జూన్ 14(జనం సాక్షి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఆదివారం రోజు మండల అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశంలో ఏర్పాటుచేసి ఈ సందర్భంగా హమీద్ మాట్లాడుతూ, నిన్న మొన్నటి వర్షాలకు కూలిపోయిన ఇండ్ల గురించి గానీ, ఇక్కడి ప్రాంత సమస్యలు పట్టించుకోవడంలేదని స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ కు కనబడుటలేదని ప్రశ్నించారు, ఇక్కడి ప్రాంత ప్రజలకు కేటీఆర్ చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు, కేటీఆర్ కు ఓటు హక్కు అడిగే అర్హత లేదన్నారు, మా యొక్క జిల్లా ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ఎవరికి ఎంత నష్టం జరిగిందో మండల వ్యాప్తంగా తిరిగి చూశారని, ఎవరికి ఇల్లు నష్టం జరిగిన బాధిత కుటుంబాలకు వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం అని తెలిపారు, ఇక్కడి ప్రాంత ప్రజలకు కేకే మహేందర్ రెడ్డి సాధకబాధకల్లో ఇక్కడే ఉంటూ తెలుసుకున్నారని అన్నారు, బాధిత కుటుంబాలకు ₹4,000 నగదు 25 కేజీల బియ్యం పంపిణీ చేశామని తెలిపారు, ఈ కార్యక్రమంలో, పట్టణ అధ్యక్షులు రాజు, ఇందిరమ్మ ఇండ్ల డైరెక్టర్ ఓరుగంటి నరసింహులు, లక్కం నాంపల్లి, కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షులు, గంగి స్వామి, లింగన్నపేట గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్, సీనియర్ నాయకులు బంగ్లా రాజు, గుడి కాడి కుమార్, ప్రసాద్ రావు, అక్క పెళ్లి బాలయ్య, సోషల్ మీడియా,దేశెట్టి శేఖర్, గౌరీ శంకర్, నరేష్ , కూడెలి ప్రవీణ్, టేకుమల్ల ప్రవీణ్, తదితరులు ఉన్నారు.

తాజావార్తలు