మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదుకుంటాడనే ఆశతో పేందూర్ సుభద్రి బాయి ఎదురుచూపులు
సిరికొండ (జనం సాక్షి ) జూన్ 13 : అదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో నేడు మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. రిమ్మ గ్రామానికి ఆదర్శ గ్రామంగా తీసుకోని గ్రామంలో 100కు పైగా ఇందిరమ్మ ఇల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది. సకాలంలో ఇందిరమ్మ ఇల్లులు పూర్తిగా కావడంతో మంత్రి జూపల్లి చేతులు మీదుగా ఇండ్లలో ప్రారంభించనున్నారు. రిమ్మ గ్రామానికి చెందిన పేందూర్ సుభద్రి బాయి చెందిన ఇల్లు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇంటి పైరేకులు ఎగిరిపోవడంతో నివాసానికి ఇల్లు లేకపోవడంతో ఇందిరమ్మ ఇల్లు కోసం ఆశగా ఎదురుచూస్తుంది. అధికారులకు తన సమస్య తెలిపిన ఇలా వచ్చి అలా వెళ్లిపోయారనే ఆశలే మిగిలిపోయాయి బాధ్యత పేందూర్ సుభద్రి బాయి చెబుతుంది. నేడు పర్యటనలో మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఆశ పెట్టుకుని పరామర్శించి ఆదుకుంటారని ఆశతో ఎదురుచూస్తుంది.



