బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి

జూన్ 13 (జనం సాక్షి ) భీంగల్ పట్టణ కేంద్రంలో లింబాద్రిగుట్ట వడ్డెర కాలనీ లో ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ముగ్గురు చిన్నారుల తల్లిదండ్రులను పరామర్శించిన రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి. వారికి ప్రభుత్వం తరఫున తగు సహాయాన్ని అందజేస్తామని తెలియజేశారు. టీజీఎండీసీ చైర్మన్ ఈరవాత్రి అనిల్. మానాల మోహన్ రెడ్డి. కలిసి వారికీ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.వారి వెంట భీంగల్ మున్సిపల్ చైర్మన్ బోదిరే నాగమణి స్వామి. వైస్ చైర్మన్ జేజె నరసయ్య. భీంగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు పర్స్ అనంతరావు. నాగేంద్ర. వివిధ గ్రామ సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు