డ్రగ్స్, ఆన్లైన్ గేమ్స్, సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యల జోలికి వెళ్ళకండి మీ ప్రాణాల మీదకు తెచ్చుకోకండి

 

 

 

 

 

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 18 (జనం సాక్షి)

డ్రగ్స్, ఆన్లైన్ గేమ్స్, సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యల జోలికి వెళ్ళకండి మీ ప్రాణాల మీదకు తెచ్చుకోకండన్ని బిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రాంరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గేట్ సమీపంలో గత రెండు రోజుల నుంచి బిఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని నాలుగు మండలలు, రెండు మున్సిపాలిటీల నుంచి 44 ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 950 విద్యార్థులు ఈ క్రీడా పోటీలలో పాల్గొన్నగా, వారికీ వాలీబాల్, కో కో, కబడ్డీ టోర్నమెంట్లను నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… విద్యార్థి దశ నుంచే డ్రగ్స్, ఆన్లైన్ గేమ్స్, సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యలు, మత్తు పానీయాల వంటి మహ్మరికి అలవాటు పడకుండా క్రీడల వైపు దృష్టిసారించి తమ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మల్చుకోవాలని అన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులలోని ప్రతిభను వెలికితియడానికే ఈ క్రీడా పోటీలు నిర్వహించమని అయన పేర్కొన్నారు. విద్యార్థులు ప్రతి ఒక్కరు కామాండో గా మారి డ్రగ్స్ అనే మహ్మరిని తరిమికొట్టాలని అన్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అత్యధికంగా ఇంజినీరింగ్ కళాశాల ఉండటంతో విద్యార్థులు డ్రగ్స్ కు బానిస అయ్యి తమ భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. యువత డ్రగ్స్, మాదక ద్రవ్యలు, సైబర్ క్రైమ్, ఆన్లైన్ గేమ్స్ వంటివి తరిమికోట్టి దేశాన్ని శాశ్యశామలం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం.. క్రీడా పోటీలలో గెలుపొందిన పాఠశాల విద్యార్థులకు బహుమతులు అందజేశారు. బాలురు విభాగంలో వాలీబాల్ లో మొదటి బహుమతి రంగాపూర్ గెలుపొందగా, కబడ్డీ లో రాయపోల్ మొదటి బహుమతి గెలుపొందింది. కో కో లో చింతపట్ల గెలుపొందగా, బాలికల విభాగంలో కబడ్డీ లో ఇబ్రహీంపట్నం గెలిపొందింది. వాలీబాల్ లో యాచారం గెలుపొందగా, కో కో లో చింతపట్ల విద్యార్థులు గెలుపొందారు. ఈ కార్యక్రమంలో సీఐ లు ఏడు కొండలు, వెంకట్ రెడ్డి, ఎస్ఐ సాయితేజ, హుమన్ రైట్స్ కమిషన్ ఉపాధ్యక్షుడు వెంకటేష్, వివిధ గ్రామాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పిఇటి లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.