నన్ను పాక్‌కు పంపొద్దు.. భారత్‌లోనే ఉంటా: సీమా హైదర్
పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత ప్రభుత్వం దాయాది పాకిస్థాన్ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారత్‌లో ఉంటున్న పాకిస్థానీలను ఈ నెల 27వ తేదీ నాటికి దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ గురువారం నాడు ప్రకటన విడుదల చేసింది. పాక్ పౌరులకు జారీ చేసిన వీసాలన్నీ ఏప్రిల్ 27తో రద్దు అవుతాయని పేర్కొంది. అయితే, మెడికల్ వీసాలపై ఉన్నవారికి మాత్రం 29 వరకు అవకాశం ఇచ్చింది. ఒకప్పుడు తాను పాకిస్థాన్ పౌరురాలు అయినప్పటికీ, ఇప్పుడు భారత్ కోడలినని దయచేసి తనను పాకిస్థాన్‌కు పంపొద్దని భారత ప్రభుత్వాన్ని ఆమె కోరింది. 2023లో తన ప్రియుడు సచిన్ మీనాను పెళ్లి చేసుకున్నప్పుడే హిందూమతాన్ని స్వీకరించినట్లు గుర్తుచేసింది. అందుకే ఆమె పాక్ పౌరురాలు కాదని, భారత్‌ను విడిచివెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చని పేర్కొన్నారు. కాగా, పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్ ఆన్‌లైన్‌లో పబ్‌జీ గేమ్ ద్వారా పరిచయమైన యూపీకి చెందిన సచిన్ మీనా కోసం తన నలుగురు పిల్లలతో కలిసి 2023లో భారత్‌కు వచ్చేసిన విషయం తెలిసిందే. దేశ సరిహద్దు దాటి అక్రమంగా భారత్‌లోకి అడుగుపెట్టింది. అనంతరం ప్రియుడిని పెళ్లాడింది.