శివ మృతిపై రాజోలిలో అనుమానాలు
రాజోలి, అక్టోబర్ 28, (జనంసాక్షి) : ఈ నెల 23వ తేదీన బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో గాయపడి తుమ్మలపల్లెకు చెందిన శివ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రమాదంపై రాజోలిలో పలు అనుమానాలు రాకేత్తగా, చర్చలకు తెరతీసింది. ప్రమాదానికి ముందు మృతుడు శివకు కొందరు వ్యక్తులు మద్యం తాగించినట్లు సమాచారం. తనకు రావాల్సిన డబ్బులు రావడంతో వారు మందు పార్టీ ఇవ్వాలని అడగడం, వెంట శివను కూడా తీసుకెళ్లడంతో పాటు మందు పార్టీ ముగిశాక ఒక్కడినే పంపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తుమ్మలపల్లి, రాజోలి లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జరిగిన మందు పార్టీలో ఎవరున్నారని విషయం చాలా మందికి తెలిసినప్పటికీ గోప్యంగా ఉంచుతున్నారు. మిత్రులు, బంధువులు ఉన్నారని సమాచారం ఉండగా..శివ మృతికి తాము కారకులవుతామని రోడ్డు ప్రమాదం జరిగిందని, ట్రాక్టర్ ఢీ కోట్టి ఉండవచ్చని, గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి ఉండవచ్చని కావాలనే పుకార్లు పుట్టిస్తున్నారని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. మిత్రులతో కలిసి పార్టీ చేసుకోవడం తప్పు కాకపోయిన ఒక్కడినే అలా అబ్బాయికి పోయి పంపడం ఎంతవరకు సమజసం అని, వారు చేసిన నిర్లక్ష్యానికి నిండు జీవితం బలి కావడంతో పాటు, ఒక యువతి భర్తను కోల్పోయి, పసికందు తండ్రి లేని వాడిగా మిగిలిపోయాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. మందు పార్టీలో ఉన్న వారిలో వడ్డేపల్లి, రాజోలికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. వీరులో బంధువులు, మిత్రులు కూడా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.