మండల కేంద్రంలో డీఆర్వో ఆకస్మిక తనిఖీ

ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశం – కేజీబీవీ, పీహెచ్‌సీల పరిశీలన
దిలావర్పూర్, జూన్ 07, (జనం సాక్షి): మండలంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – SIR కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అధికారి రమేష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన రమేష్ అక్కడి సిబ్బందితో మాట్లాడారు. SIR ఫారాల పంపిణీ, ఆన్‌లైన్ వివరాల నమోదు పూర్తయ్యాయా లేదా అని ఆరా తీశారు.
బి ఎల్ ఓ లు ప్రతి ఇంటికీ వెళ్లాలి
ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి రమేష్ మాట్లాడుతూ,, బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటికీ వెళ్లి SIR పత్రాలను పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శితో కలిసి గ్రామ యువకులను ప్రోత్సహించాలని, వారి సహకారంతో SIR ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
కేజీబీవీ, పీహెచ్‌సీల పరిశీలన
అనంతరం ప్రత్యేక అధికారి మండలంలోని కేజీబీవీ హాస్టల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రాల్లోని సౌకర్యాలను పరిశీలించి, విద్యార్థినులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలతో సమావేశమయ్యారు. సీజనల్ వ్యాధుల నివారణ, నియంత్రణ చర్యలపై అవగాహన కల్పించారు.కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజన నాణ్యత, పరిశుభ్రత, హాస్టల్ సౌకర్యాలపై ఆరా తీశారు. పారిశుద్ధ్యం, ఆరోగ్య అవగాహన, సేవల నాణ్యతను మెరుగుపరచాలని సూచనలు చేశారు.ఈ తనిఖీల్లో తహసీల్దార్ అజీజ్ అహ్మద్ ఖాన్, ఎంపీడీఓ అరుణ రాణి, ఎంపీవో గోవర్దన్, సూపరింటెండెంట్ విజయలక్ష్మి, సర్పంచ్ అక్షర అనిల్ తదితరులు పాల్గొన్నారు.



