నిరుపేద కుటుంబానికి దుద్దుకూరి సుమంత్ ఫ్రెండ్స్ సర్కిల్ చేయూత

ఖమ్మం, (జనంసాక్షి) : వైరా నియోజకవర్గం, జూలూరుపాడు మండలం గుండెపుడి గ్రామంలో ఇటీవల కాళంగి నానయ్య మృతి చెందారు. నానయ్య కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో, ఆయన దశదిశకర్మ కార్యక్రమానికి దుద్దుకూరి సుమంత్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యాన్ని ఆయన కుమారులు వెంకట నర్సయ్య, వెంకటేశ్వర్లు, రమేష్‌లకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భూక్యా అరుణ, గ్రామ పెద్దలు కాళ్లూరి వెంకటేశ్వరరావు, మాజీ సొసైటీ అధ్యక్షులు కొమ్మినేని కృష్ణమూర్తి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గాదె కృష్ణయ్య, మాజీ సర్పంచ్ బానోత్ నర్సింహారావు, మాజీ ఉప సర్పంచ్ కంచర్ల సూరిబాబు, వార్డు సభ్యులు చిలుకూరి శ్రీను, వేల్పుల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే నాయకులు జవ్వాది శ్రీను, భూక్యా నర్సింహారావు, మద్దిబోయిన నాగరాజు, మద్దిబోయిన మహేష్, భూక్యా గొప్య, బాధవత్ రమేష్, బోడ హరిబాబు, బోడ రమేష్, సేవ్య, ఖండ్య, కాసు, భీముడు తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం అభినందనీయమని గ్రామస్థులు దుద్దుకూరి సుమంత్ ఫ్రెండ్స్ సర్కిల్‌ను అభినందించారు.