ఉద్యోగులు ప్రొఫెషనల్స్ గోపాలో చేరి సేవా కార్యక్రమాలు చేయాలి

మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

హయత్ నగర్, జూన్ 8 (జనం సాక్షి): గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా) స్థాపనకు 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా ప్రచురించిన “గోపా స్వర్ణధార” ప్రత్యేక సంచికను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తన మినిస్టర్ క్వార్టర్స్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ గౌడ్ సమాజంలో ఐక్యత, చైతన్యం, సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో గోపా సంస్థ ఏర్పాటై ఐదు దశాబ్దాలుగా విశిష్ట సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధి కోసం గోపా చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు.గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని విడుదల చేసిన “గోపా స్వర్ణధార” సంచిక సంస్థ చరిత్ర, సేవా కార్యక్రమాలు, సమాజాభివృద్ధికి చేసిన కృషిని ప్రతిబింబిస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలు, మేధావులు గోపాలో సభ్యులుగా చేరి సమాజ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇంకా గోపాలో భాగస్వాములు కాని వారు సభ్యత్వం తీసుకొని సంస్థ మరింత పటిష్టంగా ఎదగడానికి సహకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గోపా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండి సాయన్న గౌడ్, గౌడ హాస్టల్ అధ్యక్షులు మోతె చక్రవర్తి గౌడ్, గోపా ప్రధాన కార్యదర్శి జి.వి. శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి మొగిలి రఘునాథ్ గౌడ్, ఉపాధ్యక్షులు చెక్కిళ్ల మధుసూదన్ గౌడ్, డాక్టర్ గోపగాని ఆనంద్ గౌడ్, కారింగు భిక్షమయ్య గౌడ్, చీకూరి సత్యం గౌడ్, డాక్టర్ ఆర్. విద్యానంద గౌడ్, పి. శ్రీనివాస్ గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శులు, మరిపల్లి కళ్యాణ్ చక్రవర్తి గౌడ్, గూడెపురి సాయి వేణు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.