యాప్ లో యూరియా కొనలేక రైతుల ఇబ్బందులు

 

 

 

రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

రైతుబంధు సమితి మాజీ మండల కన్వీనర్ బచ్చు రామకృష్ణ

మర్రిగూడ, జనవరి 23 (జనం సాక్షి)ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ లో యూరియా బుక్ చేసుకున లేక కొనలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతుబంధు సమితి మాజీ మండల కన్వీనర్ బచ్చు రామకృష్ణ అన్నారు. గురువారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మర్రిగూడ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న బచ్చు రామకృష్ణ మాట్లాడుతూ..సాంకేతిక నైపుణ్యం లేక యూరియాను ఎలా కొనుగోలు చేయాలో తెలియక అయోమయం చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదే అదునుగా నైపుణ్యం ఉన్నవారు యూరియాను ఏదేచ్ఛగా తరలిస్తున్నారని వాపోయారు. యాప్ లో దొరకని యూరియా షాపులో ఏవిధంగా దొరుకుతుందని ప్రశ్నించారు.రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటాయని నిలదీశారు. కేసిఆర్ ప్రభుత్వంలో సకాలంలో ఎరువులను అందుబాటులో ఉంచారని గుర్తు చేశారు. రైతులకు సేద్యానికి ముందే పంట సాయాన్ని అందించి ఆదుకున్న ఘనత కెసిఆర్ ప్రభుత్వాలకే దక్కుతున్నదని స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని పండగ చేసిన మాజీ సీఎం కేసీఆర్ ను రైతులు తలుచుకుంటున్న పరిస్థితి చూస్తున్నామని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా పాలన అంటూ ఊదరగొట్టి ఎన్నో హామీలు ఇచ్చి అధికారం చేరిపించుకుందని విమర్శించారు.ఇప్పుడు అణిచివేతలతో ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుని నడి బజారులో ఎండగడతామని అన్నారు. కార్యక్రమంలో యరగండ్లపల్లి సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్, మాజీ సర్పంచ్ నల్ల యాదయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు రాపోలు యాదగిరి, నాయకులు చెరుకు శ్రీరామ్ గౌడ్, ఎండి యాకూబ్ అలీ, ఆంబోతు హరిప్రసాద్ నాయక్,వట్టి కోటి శేఖర్, పగడాల రఘు, నల్ల శేఖర్, వనమాల మహేష్, కోన్ రెడ్డి యాదయ్య, గుణగంటి నగేష్, పోలె సైదులు, కొండాపురం నరేష్ తదితరులు పాల్గొన్నారు.