వామాక్షి విద్యానికేతనంలో ఆకట్టుకున్న ఫుడ్‌ ఫెస్టివల్‌

హైదరాబాద్‌ (జనంసాక్షి) : నల్లకుంటలోని వామాక్షి విద్యానికేతనం హైస్కూల్‌లో ఫుడ్‌ ఫెస్టివల్‌ ఆకట్టుకుంది. ప్రతియేటా విభిన్న కార్యక్రమాలతో విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడంలో భాగంగా ఈయేడు ఫుడ్‌ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించారు. నవంబర్‌ 14 చిల్డ్రన్స్‌ డే పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులు నోరూరించే రుచులతో వంటలు చేశారు. తల్లిదండ్రుల సహకారంతో చేసిన ఈ వంటకాలను స్కూల్‌లో ప్రదర్శించగా.. టీచర్లు వారిని అభినందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆహారపు అలవాట్లు, ఆరోగ్య సూత్రాలను తెలియజేసేందుకు ఈ ఫెస్ట్‌ దోహదపడిరదని స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సువర్ణ లత కులకర్ణి తెలిపారు. ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాల పట్ల పిల్లలకు అవగాహనా ఈ కార్యక్రమం తోడ్పడిరదని అన్నారు. చదువు, విలువలతో పాటు ప్రతియేటా ఏదొక శాస్త్రీయ దృక్పథంతో కూడిన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ విద్యార్థులను చైతన్యం చేసేందుకు కృషి చేస్తున్నామని, టీచర్లు, సిబ్బంది సహకారం కూడా ఎనలేనిదని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ పేర్కొన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన ఫుడ్‌ ఫెస్టివల్‌ పిల్లలకు ఎంతో ఉత్సాహాన్నిచ్చిందన్నారు.