రేపటిలోగా వెళ్లిపోవాలంటూ.. హైదరాబాద్‌లో నలుగురు పాకిస్థానీలకు
హైదరాబాద్ (జనంసాక్షి) : నోటీసులుపహల్గామ్ ఘటన నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్థానీలను దేశం నుంచి వెళ్లగొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి వివిధ రాష్ట్రాల సీఎంలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పలు రాష్ట్రాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. తనిఖీలు చేపట్టి పాకిస్థానీలను గుర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాక్ పౌరులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరు షార్ట్ వీసాలతో ఉంటున్నట్లు గుర్తించారు. రేపటిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. కాగా, భాగ్యనగరంలో మొత్తం 213 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసుల తనిఖీల్లో తేలింది.