స్థానిక సంస్థల ఎన్నికలపై సర్కారు కసరత్తు

` 25న మంత్రివర్గసమావేశం
` నిర్ణయం తీసుకునే అవకాశం
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ఈనెల 25న సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్‌ నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. మరో వైపు పంచాయతీ ఎన్నికల కోసం హైకోర్టు విధించిన గడువు సెప్టెంబరు 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, ఎన్నికలపై కేబినెట్‌ నిర్ణయం తీసుకునే అవకాశముంది.శనివారం జరగనున్న టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ వ్యూహం ఖరారు కానుంది. రాష్ట్రపతి వద్ద తేలకపోతే పార్టీ పరంగా బీసీలకు 42శాతం సీట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సోమవారం జరగనున్న కేబినెట్‌ సమావేశంలో పాత రిజర్వేషన్ల ప్రకారం.. ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకొని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించే వీలుంది. కాళేశ్వరం కమిషన్‌ నివేదిక అంశంలో హైకోర్టు విచారణపై కూడా చర్చించి.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా నిర్ణయం తీసునే అవకాశం ఉంది.