శేషంపల్లిలో ముగిసిన గ్రామసభలు

మల్దకల్ జూలై 21 (జనంసాక్షి)మండల పరిధిలోని శేషంపల్లి గ్రామంలో మంగళవారం భూముల రి సర్వే పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా తహసిల్దార్ ఝాన్సీరాణి హాజరై సర్వే గురించి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న భూముల రి సర్వేలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో రి సర్వే మల్దకల్ మండలంలోని ఏడు గ్రామాలను ఎంపిక చేసి ముందస్తుగా ఆయా గ్రామాలలో రి సర్వే నిర్వహిస్తున్నట్లు ఆమె అన్నారు.శేషంపల్లి గ్రామంలో రి సర్వే చేస్తామని అన్నారు.దీని ముఖ్య ఉద్దేశం గ్రామ కంఠం గ్రామ శివారు గ్రామంలోని రోడ్లు పట్టా భూములు ప్రభుత్వ భూములు తదితర వాటిని సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సింగల్ విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి,సీనియర్ అసిస్టెంట్ కరీం,సర్పంచు కాంతమ్మ,జిపిఓ, పంచాయతీ కార్యదర్శి, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.గ్రామాలలో సదస్సులు ముగిసాయి.



