ఘనంగా జననాయకుని జన్మదిన వేడుకలు

జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి

తలకొండపల్లి జూన్ 07(జనంసాక్షి): తలకొండపల్లి మండల కేంద్రంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో భాజపా రాష్ట్ర నాయకులు జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.శనివారం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద టైగర్ ఆచారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా తయారు చేసిన కేకును కోసి పంచిపెట్టారు.ఈ సందర్భంగా భాజపా నాయకులు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం నాయకులు మాట్లాడుతూ..గత 40 సంవత్సరాలుగా ఒకే పార్టీలో ఉంటూ,ఓటమితో కృంగిపోకుండా ప్రజాసేవకై పరితపిస్తూ నిత్యం అందుబాటులో ఉండే ఏకైక ప్రజా నాయకుడు తల్లోజు ఆచారి మాత్రమేనని కొనియాడారు.యువతకు నిరంతర స్ఫూర్తిగా నిలుస్తూ..భాజాపా జెండాను కల్వకుర్తి గడ్డపై ఎగురవేసేందుకు కృత నిశ్చయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.టైగర్ ఆచారి నాయకత్వంలో భాజపా పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షులు తిరుమణి రవి గౌడ్,భాజపా జిల్లా నాయకులు పాండు ప్రసాద్,బక్కి కుమార్,నీలకంఠం పాండు,పద్మ అనిల్,పెరుమండ్ల రాజు,పోతుగంటి మహేష్,ఈసారి శ్రీకాంత్,బాలకృష్ణ,భాజాపా కార్యకర్తలు,నాయకులు,తదితరులు పాల్గొన్నారు.