అంగన్‌వాడీ భవన నిర్మాణ భూమి పూజ

తరిగొప్పుల జనం సాక్షి 26తరిగొప్పుల మండల కేంద్రంలోని బొంత గట్టు నాగారం గ్రామంలో సర్పంచ్ కుర్రె మల్లయ్య సోమవారం అంగన్వాడి కేంద్ర భవన నిర్మాణ పనుల శంకుస్థాపన చేశారు. సర్పంచ్ కుర్రె మల్లయ్య మాట్లాడుతూ చిన్నపిల్లలు, గర్భిణులు, మరియు బాలింతలకు పౌష్టికాహారం, ముందస్తు విద్యను అందించేందుకు ప్రతి పిల్లల్ని అంగన్వాడికి పంపించాలని, ఇంతకుముందు అద్దె ఇళ్లలో లేదా అరకొర వసతులతో నడుస్తున్న కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించడం లక్ష్యంగా,చిన్నారులకు ఆట స్థలం, సురక్షితమైన తాగునీరు, మరియు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కరుణాకర్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ సెక్రెటరీ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.