సెక్రటేరియ‌ట్‌కు బ‌య‌ల్దేరిన గ్రూప్-1 అభ్య‌ర్థులు

గ్రూప్-1 అభ్య‌ర్థుల ఆందోళ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. అశోక్‌న‌గ‌ర్ చౌర‌స్తాకు ఇవాళ ఉద‌యం భారీ సంఖ్య‌లో గ్రూప్-1 అభ్య‌ర్థులు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. జీవో 29 వ‌ద్దు.. జీవో 55 ముద్దు అని నినాదాలు చేశారు. త‌క్ష‌ణ‌మే జీవో 29ను ఉప‌సంహరించుకోవాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో 29 కార‌ణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌ని అభ్య‌ర్థులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సీఎం డౌన్ డౌన్ నినాదాల‌తో అశోక్ న‌గ‌ర్ ద‌ద్ద‌రిల్లిపోయింది.ఇక అశోక్ న‌గ‌ర్ నుంచి సెక్ర‌టేరియ‌ట్‌కు ర్యాలీగా వెళ్లిన గ్రూప్-1 అభ్య‌ర్థుల‌ను ఇందిరా పార్క్, రామ‌కృష్ణ మ‌ఠం వ‌ద్ద పోలీసులు అడ్డుకున్నారు. అశోక్ న‌గ‌ర్ నుంచి సెక్ర‌టేరియ‌ట్ వ‌ర‌కు పోలీసులు భారీగా మోహ‌రించారు. దీంతో అభ్య‌ర్థులు రోడ్డుపై బైఠాయించి నిర‌స‌న తెలుపుతున్నారు. అశోక్ న‌గ‌ర్, ఇందిరా పార్క్, లోయ‌ర్ ట్యాంక్ బండ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది.

తాజావార్తలు