హరీష్ రావు కి పితృవియోగం..సంతాపం వ్యక్తం చేసిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని, (జనంసాక్షి) : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కి పితృ వియోగం కలిగిన వార్త పట్ల మంథని ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణంపై మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు. ఈ దుఃఖ సమయంలో హరీష్ రావుకి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.



