వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో ముగిసిన విచారణ
న్యూఢిల్లీ (జనంసాక్షి): వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పూర్తి వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వారం రోజుల గడువు కోరింది. కేంద్రం కోరిక మేరకు సుప్రీం గడువు ఇచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వర్ఫ్ బోర్డులో కొత్త నియామకాలు చేయొద్దని ఆదేశించింది. వారం రోజుల్లో పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. వక్స్ ఆస్తులలో ఎలాంటి మార్పు చేయవద్దని.. వక్స్, వక్స్ బై యూజర్ ఆస్తులను డీ నోటిఫై చేయొద్దని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వారం రోజులకు తదుపరి విచారణ చేపట్టనుంది.