సర్ ప్రక్రియ సాఫీగా సాగేలా సహాయ కేంద్రాలు సమర్థవంతంగా పనిచేయాలి

* నిజమైన ఓటర్లకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలి
* కాంగ్రెస్ శ్రేణులకు ఉప్పల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి పిలుపు
ఉప్పల్ జులై 21 ( జనం సాక్షి ): ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ “సర్” ప్రక్రియ సాఫీగా, వేగవంతంగా జరిగేలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాధ్యతగా పనిచేయాలని ఉప్పల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరిరక్షణకు కృషి చేయాలని ఆమె సూచించారు.మంగళవారం ఉప్పల్ కచ్చిర్ స్కూల్ వద్ద కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఈగ ఆంజనేయులు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “సర్” సహాయ కేంద్రాన్ని ఉప్పల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి సందర్శించి పరిశీలించారు. సహాయ కేంద్రం ద్వారా ఓటర్లకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించి ప్రజలకు అందుతున్న సహాయంపై కార్యకర్తలతో చర్చించారు.ఈ సందర్భంగా మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో నిజమైన ఓటర్లకు ఎలాంటి నష్టం జరగకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. ప్రతి ఓటరుకు ప్రక్రియపై అవగాహన కల్పించి, వారి సందేహాలను నివృత్తి చేయడంతో పాటు అవసరమైన సహాయాన్ని అందించాలని సూచించారు.అదేవిధంగా బీఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ ఓటర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా, అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. “సర్” ప్రక్రియ పూర్తయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయ కేంద్రాల ద్వారా సేవలు అందించాలని ఆమె పేర్కొన్నారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రజిత పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలను తెలుసుకుని, అధికారులతో సమన్వయం చేసుకుంటూ “సర్” ప్రక్రియను సజావుగా పూర్తి చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఈగ ఆంజనేయులు ముదిరాజ్, బజారు జగన్నాథ్ గౌడ్, తుమ్మల దేవి రెడ్డి, సల్లా ప్రభాకర్ రెడ్డి, మంద మురళీకృష్ణ రెడ్డి, మాశెట్టి రాఘవేందర్, భూత్కూరి మదన్ గౌడ్, కన్నమైన నరేష్, భాస్కర్ రెడ్డి, గోరిగ మహేష్, అలుగుల అనిల్, బచ్చా రాము, రాంరెడ్డి, రంగుల శేఖర్, ముదిగొండ రవి, ప్రశాంత్ రెడ్డి, మినంపల్లి కిషోర్, చంద్రశేఖర్ రెడ్డి, విజయ్, ఆసిఫ్, బట్కిరి కుమార్, తైసిన్, మోసిన్, అతిఫ్, వహీద్ తదితర ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు



