అక్రమ ఇసుక మాఫియా కు పచ్చని పంట నాశనం

రాజాపూర్, జనంసాక్షీ: మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం మల్లేపల్లి శివారులోని దుందుభి వాగు నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా అక్రమంగా మట్టిని కడిగి ఫిల్టర్ ఇసుకను తయారుచేసి టిప్పర్ల ద్వారా రాజధానికి తరలిస్తున్నారని, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని రైతులు భాస్కర్ రెడ్డి, పరిసప్రాంతాల్లో ఉన్న రైతులు డిమాండ్ చేస్తున్నారు. పలుమార్లు సంబంధిత శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎవరు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని రైతులు ఈ సందర్భంగా తెలిపారు.



