మావోయిస్టులపై ఉక్కుపాదం: మూడు రాష్ట్రాల సరిహద్దులో భీకర ఆపరేషన్
ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా భద్రతా బలగాలు అతిపెద్ద ఆపరేషన్ చేపట్టాయి. కర్రెగట్ట, నాడ్‌పల్లి, పూజారి కాంకేర్ అటవీ ప్రాంతాల్లోని ‘మావోయిస్టు బెటాలియన్ నెం.1’ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. సుమారు 10,000 మంది ఎలైట్ కమాండోలు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. ఛత్తీస్‌గఢ్ డీఆర్జీ, తెలంగాణ గ్రేహౌండ్స్, మహారాష్ట్ర సి-60 బలగాలు సంయుక్తంగా మావోయిస్టుల ప్రధాన స్థావరాన్ని చుట్టుముట్టాయి.. మావోయిస్టులకు ‘లొంగిపోవడం లేదా మరణించడం’ తప్ప మరో మార్గం లేని పరిస్థితి ఏర్పడిందని బలగాలు పేర్కొన్నాయి.గత 72 గంటలుగా భద్రతా బలగాలు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ముందుకు సాగుతున్నాయి. మావోయిస్టుల ఆహారం, నీటి సరఫరా మార్గాలను బలగాలు పూర్తిగా నియంత్రణలోకి తీసుకున్నాయని, దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం.