భక్తుల కొలహాలాల మధ్య వైభవంగా జగన్నాథ రథ యాత్ర

భీంగల్ టౌన్,July19 (జనం సాక్షి) భీంగల్ పట్టణం ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో జగన్నాథ రథ యాత్ర అంగరంగ వైభవంగ నిర్వహించడం జరిగింది.జగన్నాథుని ప్రతిమను రథంలో ప్రతిష్టించి అత్యంత భక్తి శ్రద్దలతో,కీర్తనలు జపిస్తూ భక్త జనసందోహల మధ్య పట్టణ వీదుల్లో దేవుని రథంను ఊరేగించారు.ఈ రథ యాత్రలో చిన్నారుల శ్రీ కృష్ణుని, గోపికల వేశాధారణలు,నృత్య ప్రదర్శనలు,కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.పట్టణ ప్రజలు,మహిళలు,వృద్దులు,చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



