సంతాపం తెలిపిన కేటీఆర్
హైదరాబాద్ (జనంసాక్షి) : సీనియర్ పాత్రికేయుడు, ప్రజల జర్నలిస్ట్ ఎండీ మునీర్ అకాల మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సింగరేణి, ఉత్తర తెలంగాణలో జరిగిన అనేక ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచిన మునీర్ మరణం తీరని లోటన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి సకల జనుల సమ్మె కన్వీనర్‌గా మునీర్ పోషించిన పాత్ర చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. మునీర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.