ఆగి ఉన్న బస్సును ఢీ కొట్టిన లారీ..

– ఇద్దరి దుర్మరణం.. ఇద్దరికి తీవ్ర గాయాలపాలు
ఆర్మూర్,ఆగస్టు 13 (జనంసాక్షి): తీర్థంయాత్ర కాస్త విషాదంగా మిగిల్చిన ఘటన ఆర్మూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.మహారాష్ట్ర నాందేడ్ కిన్వటు నుండి హైదరాబాద్ చిన్న జీయర్ స్వామి తీర్థయాత్రకు రెండు బస్సులతో తీర్థయాత్రకు బయలుదేరారు.ఆర్మూర్ మండల పరిధిలోని గోవింద్ పెట్ బ్రిడ్జి వద్ద ముందున్న బస్సు టైర్ పంచర్ కావడంతో రెండు బస్సులు హైవే పై నిలిచిపోయాయి.వెనుక బస్సులో ఉన్న ప్రయాణికులు కొందరు టైరు పంచర్ అయినందున మధ్యలోని డివైడర్ పై కూర్చుని సేద తీరుతున్నారు.వెనుక వైపు నుండి వస్తున్న లారీ ఆగి ఉన్న బస్సును గమనించక అతివేగంతో బస్సును ఢీకొట్టాడు.దీంతో ప్రయాణికులతో నిండి ఉన్న బస్సు ముందుకు కదలి డివైడర్ ప్రాంతంలో కూర్చున్న ప్రయాణికుల మీదికి దూసుకెళ్లింది.దీంతో ఇద్దరు మహిళలు సుజాత,మాధవి అక్కడికక్కడే మృతి చెందారు.ఇద్దరు తీవ్ర గాయాల పాలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



