సెలవులపై వెళ్లిన మండల వైద్యాధికారి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిలిచిపోతున్న సేవలు….
వైద్యం కోసం ఎదురుచూస్తూ బెంచిపై నిద్రపోతున్న ఓ మహిళ

ముత్తారం,జూలై 08(జనంసాక్షి):మండల వైద్యాధికారి సెలవుపై వెళ్లడంతో ముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోతున్నాయి.దీంతో రోగులు గంటల తరబడి వేచి ఉండి నిరాశతో వెనుదిరుగుతున్నారు.బుధవారం ఉదయం నుంచే పీహెచ్‌సీకి వచ్చిన రోగులకు డాక్టర్ లేకపోవడంతో ఎలాంటి వైద్యం అందలేదు.అసలే వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు జ్వరం,దగ్గు,బీపీ,షుగర్ ఇతర పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులకు మందుల ఇచ్చి పంపిస్తున్నారు..వైద్యం కోసం ఎదురుచూస్తూ ఒక మహిళ ఉదయం 9 గంటల నుంచి వైద్యం కోసం పీహెచ్‌సీకి వచ్చి వేచి ఉంది. డాక్టర్ రాకపోవడంతో ఆమె ఆవరణలో ఉన్న బెంచిపైనే నిద్రపోయింది.మరో మహిళకు ఇంటి వద్ద కోతి కరవడంతో ఉదయం నుంచి కూర్చున్నా. డాక్టర్ ఎప్పుడు వస్తారో తెలియడం లేదు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.పీహెచ్‌సీ సిబ్బంది మాట్లాడుతూ డాక్టర్ సెలవులో ఉన్నారు. వారి స్థానంలో ఇంచార్జ్ డాక్టర్‌ను పంపాలని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం.కానీ ఇప్పటివరకు ఎవరూ రాలేదు” అని తెలిపారు.ఇది ప్రభుత్వ వైఫల్యమని గ్రామస్తులు మండిపడ్డారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే డాక్టర్ లేకపోతే పేదలు ఎక్కడికి వెళ్లాలి? ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే స్తోమత లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి శాశ్వత డాక్టర్‌ను నియమించాలి” అని డిమాండ్ చేశారు.వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని,పీహెచ్‌సీలో డాక్టర్‌ను నియమించి రోగులకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

తాజావార్తలు