వందేమాతరం పై పట్టింపు లేని మండల పరిషత్ అధికారులు…

 

 

 

 

గంభీరావుపేట నవంబర్ 07 (జనం సాక్షి):

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు మరియు అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో వందేమాతరం రచించి 150 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రభుత్వం 10 గంటలకు వందేమాతరం గీతం ఆలపించాలని ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల పరిషత్‌లో అధికారులు మాత్రం సమయానికి రాక నెమ్మదిగా 11 గంటలకు వచ్చి వందేమాతరం ఆలపించారు. వారిని చూసి పలువురు పదిమందికి చెప్పవలసిన అధికారులే సరిగ్గా టైం మెయింటెనెన్స్ లేదు ప్రజలకు ఎలా పని చేస్తారని ముచ్చరిస్తున్నారు.