బస్తర్ ఎన్ కౌంటర్ మృతుల్లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు..

హైదరాబాద్ : ఛత్తీస్ గఢ్ అడవుల్లో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత, తొలితరం నాయకుడు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మావోయిస్టు పార్టీ తొలితరం నాయకుడు.. కేంద్ర కమిటీ సభ్యుడు మాచర్ల ఏసోబు అలియాన్ జగన్ ఊరఫ్ రణదేవ్ దాదా ఛత్తీస్ గఢ్ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందారు. రణ్ దేవ్ దాదా కేంద్ర మిలటరీ ఫోర్స్ ఇంఛార్జీగా పార్టీ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. మహారాష్ట్ర – చత్తీస్ గఢ్ బార్డర్ ఇంఛార్జి అయిన రణ దేవ్ బాబాను ఎదురు కాల్పుల్లో హతమార్చినట్టు దంతెవాడ పోలీసులు ధృవీకరించారు. రణదేవ్ బాబా స్వస్థలం హన్మకొండ జిల్లా కాజీపేట మండలం టేకుల గూడ గ్రామం అని పోలీసులు తెలిపారు. జగన్‌పై ఇప్పటికే రూ. 25 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జగన్‌తో పాటు మరో ఎనిమిది మంది చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.

చనిపోయిన మావోయిస్టుల వివరాలు..
1. రణధీర్.. పోస్ట్ DKSZCM. వరంగల్ నివాసి. రివార్డు-25 లక్షలు.
2. కుమారి శాంతి. పోస్ట్- 31 PL సభ్యులు. రివార్డు- 05 లక్షలు
3. సుశీల మడకం, భర్త జగదీష్. పోస్ట్- ACM. రివార్డు- 05 లక్షలు.
4. గంగి ముచకి, హోదా- కాటేకల్యాణ్. ఏరియా కమిటీ సభ్యుడు. రివార్డు-05 లక్షలు.
5. కోసా మాద్వి, హోదా- మలంగిర్. ఏరియా కమిటీ పార్టీ సభ్యుడు. రివార్డు- 05 లక్షలు.
6. లలిత. పోస్ట్- DVCM సురక్షా దళ్ సభ్యుడు. రివార్డు- 05 లక్షలు.
7. కవిత. పోస్ట్ గార్డ్ ఆఫ్ AOBSZC. రివార్డు- 05 లక్షలు.
8. హిడ్మే మంకం. DVCM సురక్షా దళ్ సభ్యుడు. రివార్డు – 02 లక్షలు
9. కమలేష్. ప్లాటూన్ సభ్యుడు. బీజాపూర్ నివాసి. రివార్డ్ -2 లక్షల