సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి “సురవరం” మృతి పట్ల మంత్రి శ్రీధర్ బాబు సంతాపం

మంథని, (జనంసాక్షి) : ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మృతి చెందడం తీవ్ర బాధాకరం అని మంథని ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కార్మికుల హక్కులు , సామాజిక న్యాయం కోసం ఒక దృఢమైన పోరాట యోధుడు ఆయన అని కొనియాడారు. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడానికి అణగారిన వర్గాలను ఉద్ధరించడానికి తన జీవితాన్ని సురవరం అంకితం చేశారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.