రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గండ్ర
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని భాగిర్తిపేట క్రాస్ నుండి బుద్ధారం గ్రామం వరకు నిర్మాణంలో ఉన్న రోడ్డు పనులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల నాణ్యత, స్పీడ్ గా పనులు చేసే విధానాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందేలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే పనులు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. అనంతరం రేగొండ మండలంలోని కొడవటంచలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో దైవ దర్శనం చేసుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కొడవటంచ ఆలయ చైర్మన్, అధికారులు, పార్టీ లీడర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



