మారుతీ వ్యాన్ ను డికొన్న బైక్ వ్యక్తి దుర్మరణం

జనం సాక్షి :భూత్పూర్.భూత్పూర్ మండలం కొత్తమోల్గరా గ్రామం గ్రామంలో తుల్జా భవాని తాండ సమీపంలో ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో మద్దిగట్ల గ్రామానికి చెందిన గుండుమల్ల త్రినాధ్ 20 సంవత్సరాలు గల యువకుడు అక్కడికక్కడే మృతి చెందినాడు మహబూబ్నగర్లో బైక్ మెకానిక్ గా పనిచేస్తున్న శ్రీనాథ్.తన స్వగ్రామం నుంచి మోటార్ సైకిల్ పై మహబూబ్నగర్ కి బయలుదేరినాడు ఈ క్రమంలో శ్రీశైలం వైపు వెళ్తున్న మారుతి వ్యాన్ ను ఢీకొన్నాడు. ప్రమాద సమయంలో టైర్ పేలడంతో వాహనం అదుపుతప్పినట్లు సమాచారం ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న త్రినాధ్ తీవ్రంగా గాయపడి ప్రమాద స్థలంలోనే చనిపోయినాడు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించినారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు