నేత్ర పర్వంగ గరుడ రథోత్సవం..గరుడ వాహనంపై.. సీతారాముడు

స్వామి వారిని దర్శించుకున్న కొండూరి రవీందర్ రావు..

గంభీరావుపేట ఏప్రిల్ 03 (జనం సాక్షి):

రాజన్న సిరిసిల్ల జిల్లా మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతు న్నాయి. గురువారం రోజు స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ రథోత్సవం పై వాహనంపై పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు.భాజా భజంత్రీ లు మంగళ వాయిద్యాలు భక్తుల రామనామ స్మరణతతో స్వామి వారిని ఊరేగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాస్కబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు తో పాటు, సెస్ డైరెక్టర్ నారాయణరావు, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు, దర్శించుకుని స్వామివారి ఆశీర్వాదం పొందారు అనంతరం మహిళలు మంగళ హారతులతో పెద్ద ఎత్తున స్వామివారికి స్వాగతం పలికారు, ఆలయ చైర్మన్ మల్లు వారి నర్సా గౌడ్ మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ రథోత్సవంనికి చుట్టుపక్కల నుండి కాకుండా వివిధ జిల్లాల నుండి హాజరయ్యే భక్తజనానికి అన్ని విధాల ఏర్పాటు చేశామని, ప్రజలందరూ స్వామివారిని దర్శించుకుని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు, అంతేకాకుండా స్వామివారికి యువసేన 99 రోజు అసోసియేషన్ వారి తరఫున పులిహోర వితరణ చేసినందుకుగాను స్వామి వారి ఆశీస్సులు ఉంటాయని తెలిపారు.