రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు ఖమ్మం జిల్లా నూతన కమిటీ

 

 

 

 

 

 

నియామక పత్రం అందుకుంటున్న
నూతన జిల్లా అధ్యక్షుడు
రవికుమార్ చౌహాన్

— లావుడ్యా రవికుమార్ చౌహాన్ జిల్లా అధ్యక్షులు

— మత్రు నాయక్ ప్రధాని కార్యదర్శి

కామేపల్లి.జనవరి 13 (జనంసాక్షి):- కామేపల్లి మండల కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశంలో లావుడియా రవికుమార్ చౌహన్ ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు
రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు, తెలంగాణ రాష్ట్రం లోని మహానగరం రాజధాని హైదరాబాద్ లో 33 జిల్లాల నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో భాషా పండితులు స్కూల్ అసిస్టెంట్ భాషలు ఉపాధ్యాయులుగా పని చేస్తున్నటువంటి వారి సమస్యల సాధనకు,భాషల అభివృద్ధి కొరకు రాష్ట్ర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాల వారీగా నూతన జిల్లా కమిటీని రాష్ట్ర అధ్యక్షులు శానమోని నరసింహులు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తిరాజు శశి కుమార్ అధ్యక్షతన రాష్ట్ర ప్రధాన సలహాదారులు శ్రీ గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వం లో రాష్ట్ర శాఖ సభ్యుల సమీక్షంలో తీర్మానం చేయడం జరిగింది.33 జిల్లాల నూతన కమిటీలో భాగంగా రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు ఖమ్మం జిల్లా నూతన కమిటీని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ నూతన కమిటీలో లావుడ్యా రవికుమార్ చౌహాన్ జిల్లా అధ్యక్షులు,గుగులోత్ మత్రు నాయక్ ప్రధాన కార్యదర్శి.వై.సుచరిత రాష్ట్ర మహిళ కార్యదర్శి,అజ్మీరా బాబురావు.రాష్ట్ర కార్యదర్శి గా ఖమ్మం నుండి ఎన్నికయ్యారు. నూతన కమిటీ బాధ్యతలు చేపట్టిన ఖమ్మం జిల్లా అధ్యక్షులు లావుడ్యా రవికుమార్ చౌహన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.
భాష పండితులు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు,హిందీ,ఆంగ్లం సంస్కృతం,మరాఠీ, కన్నడ,ఉర్దూ ఉపాధ్యాయులకు అండగా తోడుగా ఉంటూ భవిష్యత్తులో వారు ఎదుర్కొనే సమస్యల సాధనకు కృషి చేస్తానన్నారు. తనకు అప్పగించిన ఈ పదవి బాధ్యతలను పూర్తిగా బాధ్యత వహించి, అందరికీ సకాలంలో అందుబాటులో ఉంటూ వారి సమస్యలతో పాటు సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. నా మీద నమ్మకంతో నాకు నూతన కమిటీలో జిల్లా అధ్యక్షునిగా ఎనుకున్నందుకు రాష్ట్ర అధ్యక్షులుకి,ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర బాధ్యులు జిల్లా బాధ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.