పోచంపల్లి మున్సిపాలిటీ బడ్జెట్ సిద్ధం
రూ. 859.25 లక్షల బడ్జెట్‌తో పోచంపల్లి అభివృద్ధికి బాటలు
భూదాన్ పోచంపల్లి, మార్చి 31 (జనం సాక్షి): పోచంపల్లి పురపాలక సంఘం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 859.25 లక్షల సాధారణ బడ్జెట్‌ను సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపనున్నట్లు మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం పోచంపల్లి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ అంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు అధ్యక్షతన బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జీతాలు, పారిశుద్ధ్యం, విద్యుత్ బిల్లులు వంటి తప్పనిసరి ఖర్చులతో పాటు 10 శాతం నిధులను హరిత హారం పనులకు కేటాయించినట్లు తెలిపారు. అలాగే మిగిలిన నిధుల్లో 1/3 వంతును అభివృద్ధి చెందని ప్రాంతాలు, మురికివాడల అభివృద్ధికి వినియోగించనున్నట్లు చెప్పారు. పార్కులు, వైకుంఠధామాలు, ప్రజా మరుగుదొడ్లు, డంప్ యార్డుల నిర్వహణ వంటి పనులకు కూడా నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ కొయ్యడ రజిని శ్రీనివాస్ గౌడ్, వార్డ్ కౌన్సిలర్లు శ్రీరామ్ మంజుల లింగస్వామి, కొండమడుగు ఎల్లస్వామి, రావుల జంగయ్య, పెద్దల చక్రపాణి, బాత్క లింగస్వామి, కర్నాటి వరలక్ష్మి నరసింహ, రాపోలు కావ్య వేణు, దేవరాయ కుమార్, జింకల లావణ్య యాదగిరి, కుడికాల అఖిల బలరాం, సూరేపల్లి రాధిక రమేష్ తదితరులు పాల్గొన్నారు.


