ఉన్నత చదువులకు పేదరికం అడ్డంకి


బజార్హత్నూర్ జూలై ( జనం సాక్షి):-ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని మంజిరం తండాకు చెందిన ఆదివాసీ అంధ విద్యార్థి టేకాం గణపతి ఇటీవల ఉట్నూర్ వికాసం పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశాడు. ఇంటర్ చదివేందుకు హైదరాబాద్ వెళ్లాల్సి ఉండగా, ఆర్థిక స్థోమత లేక తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు. తన పైచదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు తోడ్పాటు అందించాలని ఆ విద్యార్థి వేడుకుంటున్నాడు.



