భద్రాచలం వద్ద జరభద్రం
మరో మూడు రోజులు భారీ వర్షాలు
` మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
` 43 అడుగులు దాటిన నీటిమట్టం
` జాతీయ రహదారిపైకి వరదనీరు..
` ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు రాకపోకలు బంద్
` గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
` కృష్ణమ్మకు పోటెత్తిన వరద
` జూరాల గేట్లు ఎత్తివేత..
` శ్రీశైలంకు చేరుకుంటున్న వరద నీరు
` మేడిగడ్డకు పోటెత్తిన వరద..
` ప్రాజెక్టుకు 4 లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో
` అంతే మొత్తంలో దిగువకు విడుదల
` నిండుకుండలా హుస్సేన్ సాగర్
` భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన పంటలు
` రాగల మూడురోజులూ.. తెలంగాణలో భారీ వర్షాలు!
హైదరాబాద్,భద్రాచలం(జనంసాక్షి):భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నిన్న 34 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం ఆదివారం సాయంత్రం 7 గంటలకు 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఇంకా పెరుగుతుందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు గోదావరి వద్దకు వెళ్ల వద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద నీరు పెరగడంతో భద్రాచలం స్నాన ఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు నీటిలో మునిగిపోయాయి. చర్ల మండలం వద్ద ఈత వాగుపై నుంచి వరద నీరు పారడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం వద్ద సీతవాగు, గుబ్బల మంగి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పర్ణశాల వద్ద నార చీరల ప్రాంతం వరద నీటిలో మునిగింది. భద్రాచలం నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు వెళ్లే ప్రధాన రహదారి చట్టి వద్ద వరద నీరు చేరడంతో తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి దిగువన ఉన్న శబరి నదికి వరద నీరు భారీగా పోటెత్తడంతో భద్రాచలం నుంచి వరద నీరు దిగువకు నెమ్మెదిగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 9లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. గోదావరి వరదపోటుతో తెలంగాణ` ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన టేకులగూడెం సవిూపంలో 163వ నెంబరు జాతీయ రహదారిపై వరదనీరు చేరింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరదపోటు తీవ్రంగా ఉండడంతో జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలను అధికారులు నిషేధించారు. వాహనాలు వెళ్లకుండా ట్రాక్టరు, ట్రక్కులను అడ్డు పెట్టారు. పంచాయతీ, పోలీసు సిబ్బంది అక్కడే ఉండి.. వరదనీటిలో వెళ్లేందుకు ప్రయత్నించే వాహనదారులను అడ్డుకుంటున్నారు. వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.మరో వైపు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో క్రమంగా నీటి ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం 10 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరం నుంచి 7.5లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి, డెల్టా కాలువలకు 1800 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.
నిండుకుండాల హుస్సేన్ సాగర్
గత మూడు రోజులుగా ఎడతెరిపిలేని వానతో హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ జలాశయానికి వరద పోటెత్తుతోంది. వరద నీటితో ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది.దాంతో మారియట్ హోటల్ వద్దనున్న మత్తడి వద్ద సందడి వాతావరణం నెలకొంది. భారీగా దిగువకు దూకుతోన్న నీటిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం(ఎఫ్‌టీఎల్) 514.75 విూటర్లుకాగా ప్రస్తుతం 513.23 విూటర్ల నీటి మట్టం నమోదైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో దిగువన ఉండే కవాడిగూడ, మిగిలిన ప్రాంతాల ప్రజలను జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.కాగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నిన్న 34 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం ఆదివారం సాయంత్రం 4 గంటలకు 41.09 అడుగులకు చేరింది.ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఇంకా పెరుగుతుందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. భద్రాచలంలో నీటిమట్టం 43 అడుగులకు పెరిగితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు. వరద నీరు పెరగడంతో భద్రాచలం స్నాన ఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు నీటిలో మునిగిపోయాయి. చర్ల మండలం వద్ద ఈత వాగుపై నుంచి వరద నీరు పారడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం వద్ద సీతవాగు, గుబ్బల మంగి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పర్ణశాల వద్ద నార చీరల ప్రాంతం వరద నీటిలో మునిగింది. భద్రాచలం నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు వెళ్లే ప్రధాన రహదారి చట్టి వద్ద వరద నీరు చేరడంతో తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి దిగువన ఉన్న శబరి నదికి వరద నీరు భారీగా పోటెత్తడంతో భద్రాచలం నుంచి వరద నీరు దిగువకు నెమ్మెదిగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 8,38,117 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. గోదావరి వరదపోటుతో తెలంగాణ` ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన టేకులగూడెం సవిూపంలో 163వ నెంబరు జాతీయ రహదారిపై వరదనీరు చేరింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరదపోటు తీవ్రంగా ఉండడంతో జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలను అధికారులు నిషేధించారు. వాహనాలు వెళ్లకుండా ట్రాక్టరు, ట్రక్కులను అడ్డు పెట్టారు. పంచాయతీ, పోలీసు సిబ్బంది అక్కడే ఉండి.. వరదనీటిలో వెళ్లేందుకు ప్రయత్నించే వాహనదారులను అడ్డుకుంటున్నారు. వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మరో వైపు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో క్రమంగా నీటి ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం 10 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరం నుంచి 7.5లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి, డెల్టా కాలువలకు 1800 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.
కృష్ణమ్మ పరవళ్లు.. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు జలకళ
ఎగువ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో పాలమూరు వరదాయిని జూరాల జలాశయానికి వరద నీరు పొటెత్తుతోంది. ఆదివారం ఇన్‌ఫ్లో 92 వేల క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 1.71లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరద ఉద్ధృతి పెరగటంతో 17 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.51 విూటర్లు కాగా, ప్రస్తుత నీటి మట్టం 317.17 విూటర్లకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 7.04 టీఎంసీలుగా నమోదైంది.ఎగువన వర్షాలు ఉండటంతో కృష్ణమ్మ ఉద్ధృతి పెరుగుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతాలైన నాగర్‌దొడ్డి, గార్లపాడు, వామన్‌పల్లి ప్రాంతాల్లో తీరం వద్దకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నారాయణపేట జిల్లాలోని కృష్ణా, మక్తల్ మండలాల పరిధి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మూడు, నాలుగు రోజులు భారీ వర్షాలు ఉండటంతో కృష్ణకు వరద ప్రవాహం పెరిగే అవకాశముంది. జూరాల గేట్లు ఎత్తడంతో వరద శ్రీశైలం జలాశయం వైపు పరుగులు పెడుతోంది. ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 96,141 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు 821.20 అడుగులు, నీటి నిల్వ 41.6978 టీఎంసీలుగా నమోదైంది.
భద్రాద్రి జిల్లాలోని గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
తెలంగాణలో భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద వచ్చి చేరుతోంది. నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 19,686, ఔట్‌ఫ్లో 18,227 క్యూసెక్కులుగా నమోదైంది.జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 690.875 అడుగులు ఉంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లోకి 385 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1387 అడుగులుగా నమోదైంది.భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 38 అడుగుల వద్ద కొనసాగుతోంది. సాయంత్రం వరకు ఇది 40 అడుగులకు చేరే అవకాశం ఉందని.. యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. భద్రాద్రి జిల్లాలోని ఉపరితల గనుల్లోకి వర్షపు నీటి చేరికతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ములుగు జిల్లలో జాతీయ రహదారిపైకి గోదావరి వరద నీరు చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 4.06 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో 85 గేట్లు ఎత్తి వరదను వదులుతున్నారు. భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకుంది. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
రాగల మూడురోజులూ.. తెలంగాణలో భారీ వర్షాలు!
రాగల మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతోపాటు గంటకు 30కి.విూ నుంచి 40కి.విూ వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిరచింది.చిలికా సరస్సు వద్ద కేంద్రీకృతమైన వాయుగుండం రాత్రి ప్రస్ఫుటమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడిరదని తెలిపింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశలో కదిలి ఆదివారం ఉదయం ఒడిశా`ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. రానున్న 12 గంటల్లో ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో అల్పపీడనంగా బలహీనపడే అవకాశముందని వివరించింది.దీని ప్రభావంతో రాష్ట్రంలో ఆదివారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది.