ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

వెల్దండ ఆగస్టు 20 ( జనంసాక్షి ) : ఆధునిక నవభారత పితామహుడు రాజీవ్ గాంధీ అని మండల పార్టీ అధ్యక్షుడు హరి కిషన్ నాయక్ అన్నారు.వెల్దండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హరికిషన్ నాయక్, డిసిసి ఉపాధ్యక్షులు ఎన్నం భూపతిరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్ ల ఆధ్వర్యంలో నవభారత నిర్మాత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు హరి కిషన్ నాయక్ మాట్లాడుతూ.. భారత సాంకేతిక రంగంలో టెలి కమ్యూనికేషన్స్, విద్య, యువత గ్రామీణ అభివృద్ధి పరిపాలన, ఎన్నికల వ్యవస్థ,ఆర్థిక రంగాల్లో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు.యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములుగా చేయడంలో రాజీవ్ గాంధీ చారిత్రకం, 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారని దీంతో కోట్లాదిమంది యువకులకు రాజకీయ అవకాశాలు దక్కాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, తాలూకా కిసాన్ సెల్ అధ్యక్షులు పర్వత్ రెడ్డి, ఉప సర్పంచ్ బస్నమోని శ్రీను ముదిరాజ్, జిల్లా సేవాదళ్ ఉపాధ్యక్షులు కొయ్యల పుల్లయ్య, సర్పంచ్ రమేష్ నాయక్, సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ బాదేపల్లి మల్లయ్య,హామీద్, వార్డు సభ్యుడు కిష్టాల్,మసిగుండ్ల వెంకటేష్, తారా సింగ్ నాయక్, కడారి శ్రీనివాస్ యాదవ్, ఈదులపల్లి శ్రీనివాసులు, బీరయ్య పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.



