సందర్శకులతో కిటకిటలాడుతున్న శీలం జానకి బాయ్ వాటర్ ఫాల్స్

సిర్నాపల్లి వాటర్ ఫాల్స్ కు పోటెత్తిన సందర్శకులు తాకిడి

ఇందల్వాయి (జనం సాక్షి) : మండలంలోని సిర్నాపల్లి గ్రామంలోని శ్రీ జానకి బాయ్ చెరువు అలుగు పారుతుండడంతో సిర్నాపల్లి వాటర్ ఫాల్స్ కు సందర్శకుల తాకిడి మొదలైంది, ఈ మేరకు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సిర్నాపల్లి గ్రామంలోని సంస్థాన్ సిర్నాపల్లి రాజు శ్రీ జానకి బాయ్ తమ గ్రామ రైతుల అవసరాల కోసం ఒక పెద్ద చెరువును నిర్మించాలని చరిత్ర చెబుతుంది, అట్టి చెరువుకు సుమారు 40 అడుగుల ఎత్తు గల అలుగును నిర్మించాలని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు, కాగా ఇటీవల గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సిర్నాపల్లి శ్రీ జానకి బాయ్ చెరువు నుండి అలుగు పారుతుండడంతో సందర్శకులు తాకిడి మొదలైందని చెర్నాపల్లి గ్రామానికి చెందిన ప్రజలు వెల్లడిస్తున్నారు, సందర్శకుల తాకిడితో సిర్నాపల్లి గ్రామానికి పూర్వ వైభవం సంతరించుకుందని ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ గుర్తు చేసుకున్నారు, సందర్శకుల తాకిడితో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు, సుమారు 200 పూర్వపు సంవత్సరాల క్రితం అప్పటి సంస్థాన అధ్యక్షురాలు శ్రీమతి జానకిబాయి తన సంస్థ పెళ్లి కి చెందిన రైతుల యోగక్షేమాల కోసం పెద్ద చెరువును నిర్మించాలని గుర్తు చేశారు, ఆనాటి చెరువే ఈనాడు ఇందూరు జలపాతంగా కొనసాగుతుందని పలువురు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, అనేక గ్రామాల నుండి పెద్ద ఎత్తున సందర్శకులు చిరునాపల్లి గ్రామానికి చేరుకుని సిర్నాపల్లి వాటర్ ఫాల్స్ ఆనందాలను తిలకిస్తున్నారని వెల్లడించారు, ఒకప్పుడు నక్సలైట్ గ్రామంగా ప్రసిద్ధి చెందిన సిర్నాపల్లి నేడు శ్రీ సంస్థాన్ సిర్నాపల్లి అధ్యక్షురాలు నిర్మించిన శ్రీ జానకి బాయ్ చెరువు అలుగు పారుతుండడంతో చూపరులతోపాటు సందర్శకులతో కిక్కిరిసిపోతుంది , దీంతో జిల్లా కలెక్టర్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని చెరువు వాటర్ ఫాల్స్ ను పర్యటక ప్రాంతంగా గుర్తించి తగు నిధులు కేటాయించాలని సిర్నాపల్లి గ్రామస్తులు కోరుతున్నారు