సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీలు ఢీ కొనడంతో ఇద్దరు క్లీనర్లు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన సదాశివపేట మండలం నిజాంపూర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు క్లీనర్లు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.