ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి: సబ్ కలెక్టర్

కల్హేర్ మండలంలో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన సబ్ కలెక్టర్ ఉమా హారతి

కల్హేర్ జులై 08( జనం సాక్షి )ఓటరు జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేయాలని నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి బిఎల్ఓలకు సూచించారు.ఆమె బుధవారం కల్హేర్ మండలంలోని క్రిష్ణాపూర్ గ్రామంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ తీరును పరినీలించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఓటర్లకు ఎదురయ్యే సమస్యలను బిఎల్వోలు దగ్గరుండి పరిష్కరించాలన్నారు.ఫారాలు నింపే క్రమంలో నిరక్షరాస్యులు ఉన్నట్లయితే బీఎల్ ఓ బాధ్యత తీసుకుని సరైన సమాచారాన్ని ఓటర్ల నుంచి తీసుకుని ఫారాలను పూర్తి చేసి అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రక్రియలో వివరాలు అందించని ఓటర్ల వ్యక్తులపేర్లు అక్టోబర్ 1న ప్రకటించే డ్రాఫ్టులో ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శివ శ్రీనివాస్ సర్పంచ్ శశికళ తుకారాం ఉపసర్పంచ్, దస్తవ రమేష్, సెక్రెటరీ రమేష్ పాల్గొన్నారు.

తాజావార్తలు