జిహెచ్ఎంసి సూపర్వైజర్ల సమస్యలను పరిష్కరించండి
హయత్ నగర్, మే 25 (జనం సాక్షి)ఈనెల 29న ఎల్బీనగర్ జోనల్ కమీషనర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని, సూపర్వైజర్ల సమస్యలను పరిష్కరించాలని నాగోల్ సర్కిల్ పరిధి లోని నాగోల్ డివిజన్ లో ఉన్న జిహెచ్ఎంసి సూపర్వైజర్ల జనరల్ బాడీ సమావేశాన్ని సిఐటియు హయత్ నగర్ సర్కిల్ కన్వీనర్ చింతపల్లి కృష్ణయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మల్లె పాక వీరయ్య, జిహెచ్ఎంసి ఎంప్లాయిస్ యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆలేటి ఎల్లయ్య లు ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న సూపర్వైజర్లకు కనీస వేతనం 30 వేల రూపాయలు చెల్లించాలని, పెట్రోల్ అలవెన్స్ కింద నెలకు 3000 రూపాయలు ఇవ్వాలని, ప్రమాదం జరిగితే బీమా సౌకర్యం కల్పించాలని, 60 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అయినట్లయితే 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, రిటైర్మెంట్ తర్వాత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిహెచ్ఎంసి కార్మికులు, జిహెచ్ఎంసి సూపర్వైజర్ల సమస్యల సాధన కొరకు ఈనెల 29వ తారీకున ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ముందు జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కార్మికులకు పిలుపునిచ్చారు. నాగోల్ డివిజన్ పరిధిలోని సూపర్వైజర్లు ఈ ఆనంద్ కుమార్, కే రవి కుమార్, తన్వీర్, టి కుమార్, జే వెంకట స్వామి, సురేష్, శ్రీనివాస్ చారి లు సిఐటియు యూనియన్ లో చేరారని వారు తెలిపారు.



