రోడ్డు సేఫ్టీ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

హెల్మెట్ లేకుండా వాహనం నడపకండి మీ ప్రాణాలను కాపాడుకోండి.

ఐజి షా నవాజ్ ఖాసీం.

వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి.
ఎస్పీ స్నేహ మేహేరా.

మెమిన్ పేట జూన్.10( జనం సాక్షి) రోడ్డు భద్రత నియమ నిబంధనలు అందరూ తప్పకుండా పాటించి రోడ్డు ప్రమాద నివారిణి లక్ష్యం రోడ్డు భద్రత వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, ఐజి షా నవాజ్ ఖాసీం అన్నారు. మోమిన్ పేట మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్, అలైవ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి 120 సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకే అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సురక్షితంగా తమ గమ్యానికి చేరుకోవాలని, అలాగే మద్యం సేవించి, ఫోన్లో మాట్లాడుతూ వాహనాలను నడప రాదని, తమ పైన తమ కుటుంబం ఆధారపడి ఉందని గ్రహించాలన్నారు. తమ సేఫ్టీ కోసమే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అలాగే గ్రామాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు, నేరాలను అదుపు చేసేందుకు మండలంలోని అన్ని గ్రామాల్లో జరిగే కార్యక్రమాలను వీక్షించేందుకు పోలీస్ స్టేషన్లో 120 సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తద్వారా నేరాలను అదుపు చేయడం జరుగుతుందని, అలాగే నేరస్తులను సులువుగా పట్టుకోవచ్చు అన్నారు శాంతిభద్రతలను కాపాడుకోవడంతోపాటు నేర రహిత సమాజాన్ని స్థాపించ వచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మేహేరా, డి.ఎస్.పి అంజయ్య, తహసిల్దార్ రవీందర్, సిఐ,జి వెంకట్, ఎస్సై భరత్ భూషణ్, ఆర్ ఐ గోవర్ధన్, సర్పంచుల సంఘం అధ్యక్షులు కోస్గి సురేందర్, సర్పంచులు కృష్ణవేణి, లావణ్య అశోక్ , బాలరాజ్ గౌడ్, మోహన్, ఆయా గ్రామాల సర్పంచులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.