గురు పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కటకం మృత్యుంజయం
గంభీరావుపేట, జూలై 29 జనం సాక్షి; గురు పౌర్ణమి సందర్భంగా ముందుగా విగ్నేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, ఆలయంలో మాజీ శాసనసభ్యులు కటకం మృత్యుంజయం తోపాటు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు చేయించి, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, రైతులకు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థించారు. అనంతరం ఊరు పురోహితులు రాచర్ల పార్థసారథి రాజు పంతులు గారిచే కటకం మృత్యుంజయంకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.



