గడ్కోలులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం..

కొత్త ఓటర్ల నమోదు పై బీజేపీ నాయకుల అవగాహన
సిరికొండ, జూలై 08 (జనం సాక్షి):
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బుధవారం గడ్కోలు గ్రామంలో బీఎల్‌వో-2లతో కలిసి బీజేపీ ఇందూరు జిల్లా ఉపాధ్యక్షులు నక్క రాజేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో కొత్త ఓటర్ల నమోదు, ఓటరు వివరాల సవరణ, మార్పులు, చేర్పులపై ప్రజలకు అవగాహన కల్పించారు.నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, 18 సంవత్సరాలు నిండిన యువత వెంటనే తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయించుకోవాలని సూచించారు. అలాగే గ్రామంలోని ప్రతి కుటుంబం తమ ఓటరు వివరాలను పరిశీలించి, అర్హులైన వారందరినీ ఓటరు జాబితాలో చేర్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు తమ కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలోని అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయించి, గ్రామంలో ప్రతి అర్హుడిని ఓటరు జాబితాలో చేర్చేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో బీఎల్‌వో-2లు, గంభీరావుపేట రాజేశ్వర్, చింతకుంట గోపి, ఓడెం భాస్కర్ తదితర నాయకులు పాల్గొన్నారు.



