ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్ (జనంసాక్షి): ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు వెల్లడించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఎస్సీలకు ఇప్పటివరకు గంపగుత్తగా అమలైన రిజర్వేషన్లను ఇక నుంచి వర్గీకరణ ప్రకారం అందనున్నాయి. మొత్తం 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించింది. ఏ గ్రూప్‌లో 15 ఉప కులాలు ఉండగా.. వారికి 1 శాతం రిజర్వేషన్లు, బీ గ్రూప్‌లో ఉన్న 18 కులాలకు 9 శాతం, సీ గ్రూప్‌లో ఉన్న 26 కులాలకు 5 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నట్లు పేర్కొంది. ఇకపై గ్రూపులు, కులాల ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీచేయనున్నారు. ఈ గెజిట్ తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ నేటి నుంచి అమల్లోకి రానుంది. ఈ నెల 8వ తేదీనే ఇందుకు సంబంధించిన బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు. ఎస్సీ వర్గీకరణపై నేడు గెజిట్ నోటిషికేషన్ విడుదల చేశారు.