రాయలసీమ ఎత్తిపోతలను ఆపండి
` శ్రీశైలం ప్రాజెక్టు 25 రోజుల్లో ఖాళీ అవుతుంది
` రోజుకు 11 టిఎంసిలు తరలిస్తే నల్లగొండ ఖమ్మం జిల్లాల రైతాంగానికి తీవ్ర నష్టం
` బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము
` గిరిజనులపై ఏమాత్రం ప్రేమ ఉన్న పోలవరం ఎత్తు తగ్గించండి
` ముంపు నుంచి రెండు లక్షల ఎకరాలను కాపాడండి
` మధిర మండలం వంగవీడులో జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి,వాకిటి శ్రీహరి
హైదరాబాద్(జనంసాక్షి):ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు 9 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన కాంగ్రెస్ కార్యకర్తలకు నా సెల్యూట్ శ్రీశైలం ఎగువ భాగాన రోజుకు 11 టిఎంసిలు తరలిస్తున్న పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలను వెంటనే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును కోరుతున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం ఆయన మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి తో కలిసి మధిర మండలం వంగవీటిలో 600 కోట్లతో నిర్మించబోతున్న జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.నాగార్జునసాగర్ ఎడమ కాలవ ద్వారా రోజుకు ఒక టీఎంసీ విడుదల చేస్తేనే ఇన్ని లక్షల ఎకరాలు సాగు అవుతుంది, పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 11 టీఎంసీలు తరలించకపోతే ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల రైతంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 11 టిఎంసిలు తరలించడంతో శ్రీశైలం ప్రాజెక్టు కేవలం 25 రోజుల్లో ఖాళీ అవుతుందన్నారు. బనకచర్ల అడ్డుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఒకవైపు కేంద్రంతో మరోవైపు న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నందుకు రాష్ట్ర ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు. సీఎం, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిటారుగా నిలబడడంతోనే బనకచర్ల, శ్రీశైలం లిఫ్ట్ ఆగిపోయాయి అన్నారు. ఎడమ కాలువ రైతుల పక్షాన వారిద్దరికీ ధన్యవాదాలు అని డిప్యూటీ సీఎం తెలిపారు. నీటి పోరాటంలో సీఎం రేవంత్ రెడ్డి ఉత్తంకుమార్ రెడ్డి నిలబడి కలబడతాం అన్నారు.భద్రాచలం డివిజన్లోని గిరిజనులు నివసించే ఏడు మండలాలను పక్కకు పెట్టాలని నాడు సోనియాగాంధీకి విజ్ఞప్తి చేయగా చట్టంలోంచి ఆ ఏడు మండలాలను మినహాయించారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి, రాష్ట్రంలో టిఆర్‌ఎస్ కలిసి దొంగ చాటుగా ఆర్డినెన్స్ తెచ్చాయి అన్నారు. ఆర్డినెన్స్ ఇవ్వడం ద్వారా గిరిజనులకు సంబంధించిన రెండు లక్షల ఎకరాలు పోలవరానికి ధారాధత్తం చేశారని డిప్యూటీ సీఎం ఆరోపించారు. గిరిజనులపై ఏమాత్రం ప్రేమ ఉన్న ఏపీ సీఎం పోలవరం ఎత్తు తగ్గించి రెండు లక్షల ఎకరాలను కాపాడాలి అని డిప్యూటీ డిమాండ్ చేశారు. గోదావరి ఎగువగ భాగాన మా ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాత, నికర జలాలు, వరద జలాల వాటా తేలిన తర్వాతే బనకచర్ల ప్రస్తావన తీసుకురావాలని డిప్యూటీ సీఎం అన్నారు.2018 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో మధిర నుంచి తాను, భద్రాచలం నుంచి పొడేం వీరయ్య ఇద్దరమే గెలిచామని ఆ సమయంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వారే ఒక ఎమ్మెల్యేగా భావించి కాంగ్రెస్ జెండాను రెపరెపలాడిరచారు, మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను 9 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన కాంగ్రెస్ కార్యకర్తలకు నా సెల్యూట్ అని డిప్యూటీ సీఎం అన్నారు.జవహర్ జాలిముడి ఎత్తిపోతల పథకం కోసం పది సంవత్సరాలపాటు ప్రతి సందర్భంలో అసెంబ్లీలో ప్రస్తావించిన ఈ ప్రాంత ప్రజల గుండె చప్పుడును టిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నారు. మధిర నియోజకవర్గంలో అయకట్టు చివరి ప్రాంత రైతుల బాధలు భావోద్రేకంతో కూడినవని డిప్యూటీ సీఎం వివరించారు. మధిర నియోజకవర్గంలోని 30 గ్రామాలకు సాగునీరు రావాలంటే మూడవ జోన్ లోని ఆంధ్ర ప్రాంతానికి వెళ్లి తిరిగి రావాల్సిన పరిస్థితి ఉండేది అన్నారు. ఆంధ్ర ప్రాంతానికి వెళ్లిన సాగునీరు తిరిగి మధుర నియోజకవర్గానికి రావాలంటే సాధ్యమయ్యే పరిస్థితి ఉండేది కాదు అన్నారు. సాగర్ మూడో జోన్ లోని మధిర నియోజకవర్గం గ్రామాలను సాగర్ రెండవ పరిధిలోకి తీసుకువచ్చేందుకు సీఎం గా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు తాను ప్రయత్నించానని డిప్యూటీ సీఎం వివరించారు. సర్వే, నిధుల మంజూరు అన్ని పనులు చివరి దశకు చేరిన ఆనాడు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆ పని అపరిస్కృతంగానే ఉండిపోయింది అన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ 10 సంవత్సరాలు ఈ సమస్యను ఎన్నిసార్లు లేవు నెత్తిన పట్టించుకున్న పాపాన పోలేదు అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుదీర్ఘకాలం పిసిసి అధ్యక్షుడిగా పని చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సాగర్ ఎడమ కాలువ పరిధిలో జరుగుతున్న అన్యాయంపై ఆనాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ విషయాలన్నీ గమనంలో పెట్టుకున్న ఉత్తంకుమార్ రెడ్డి మధిర నియోజకవర్గం లోని గ్రామాలను రెండవ జోన్ లోకి మార్చడం, ఈ ప్రాంత ప్రజల సాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు 600 కోట్లతో 30 వేల ఎకరాలకు సాగునీరు అందించే జవహర్ ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వడం పట్ల డిప్యూటీ సీఎం అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. మధిర నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉండగా ప్రతి రెండు మండలాల మధ్యన ఒక ఏరు పారుతుండడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆ నీటి వనరులను వినియోగించుకొని కట్టలేరు, జాలిమూడి ప్రాజెక్టులు నిర్మించుకున్నాం, ఈరోజు జవహర్ ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించుకున్నామని తెలిపారు.మహానుభావుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మించక ముందు ఖమ్మం జిల్లాలో జొన్నలు, కందులు, బుడం దోసకాయ పండిరచేవారు, ఇప్పుడు ఎడమ కాలువకు సాగర్ నీళ్లు రాకపోతే ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి సత్తుపల్లి వరకు రైతులు తిరిగి జొన్నలు, కందులు పండిరచాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు.
మధిర ప్రాంతానికి నీళ్లు ఇవ్వడాన్ని అదృష్టంగా భావిస్తున్నా: భట్టి
వంగవీడు: కొన్ని దశాబ్దాలుగా మధిర ప్రాంత ప్రజలు సాగునీటి కోసం ఎన్నో కష్టాలు పడ్డారని, పాలకులను వేడుకున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని వంగవీడులో రూ.630.30 కోట్లతో జవహార్ ఎత్తిపోతల పథకానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో భట్టి మాట్లాడారు. ‘’పదేళ్లు భారత రాష్ట్ర సమితి నీటి ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు. జవహార్ ప్రాజెక్టు కోసం చాలా ఏళ్లుగా మాట్లాడుతూనే ఉన్నా. అసెంబ్లీలో గళమెత్తినా గత ప్రభుత్వం దాని గురించి ఆలోచన చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరా. ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అన్ని అనుమతులు ఇచ్చారు. వారికి నా ధన్యవాదాలు. ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడాన్ని అదృష్టంగా భావిస్తున్నా’’అని చెప్పారు.అంతకుముందు ఖమ్మం జిల్లాలోని మధిర మండలం వంగవీడు వద్ద వైరా నదిపై రూ. 630.30 కోట్లతో జవహర్ ఎత్తిపోతల పథకంకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి , వాకాటి శ్రీహరి. శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో వారు ప్రసంగించారు.డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. ‘నాగార్జున సాగర్ నీరు ద్వారా నే ఈ ప్రాంతం సస్యశ్యామలమైంది. మధిర, ఎర్రుపాలెం మండలాలు సాగర్ జోను- 3 నుండి జోన్ -2 గా మారింది. బనకచర్ల, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషివల్లే ఆగిపోయాయి. పోలవరం ఎత్తు తగ్గించాలి. అమాయకులైన 2 లక్షల గిరిజన భూములు ముంపుకు గురవుతున్నాయి’ అని పేర్కొన్నారు.మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ కింద 33 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు. అత్యంత కష్టం కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీనీ నిలబెట్టింది భట్టి విక్రమార్క. గత ప్రభుత్వం 7లక్షల కోట్ల అప్పులు చేసింది. ఆర్థికశాఖ మంత్రిగా భట్టివిక్రమార్క సమర్థవంతంగా గాడిలో పెట్టారు. గత ప్రభుత్వం పదేళ్లల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసింది. అయినా పార్టీ చెక్కుచెదరలేదు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. బనకచర్ల ప్రాజెక్టుకు మేము పూర్తిగా వ్యతిరేకం. బనకచర్ల ప్రాజెక్టును కట్టనివ్వం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం, అవినీతి వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. పీసీ ఘోష్ కమిషన్ ఇదే చెప్పింది. కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది’ అని పేర్కొన్నారు.మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ‘జోన్- 3లో ఉన్న 33 వేల ఆయకట్టు జోన్ 2 గా మార్పు. గత ప్రభుత్వం పేద, అప్పుల తెలంగాణగా మార్చింది. మూడు విడతలో అర్హులైన వారికి ఇందిరమ్మా ఇల్లు పంపిణి. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు.భూ సమస్యను భూ భారతి ద్వారా శ్వాసత పరిష్కారం’అని తన ప్రసంగంలో తెలిపారుమంత్రి వాకాటి శ్రీహరి మాట్లాడుతూ.. ‘ పేదోడి పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే జరుగుతుంది’ అని స్పష్టం చేశారు.