డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకం

విజ్ఞాన్స్ యూనివర్సిటీలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు

భూదాన్ పోచంపల్లి, జూలై 23 (జనం సాక్షి): దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో తొలి సంవత్సరం బీటెక్ విద్యార్థుల ఇండక్షన్ ప్రోగ్రామ్‌లో భాగంగా మాదకద్రవ్యాల నివారణ చట్టపరమైన పర్యవసానాలు అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సహాయక సూపరింటెండెంట్లు (డీఎస్పీలు) సిహెచ్. సాయి శ్రీకాంత్, ఎం. సాయి రామ్, బెజవాడ లింగారావు, అహిజ కొల్లు పాల్గొని మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు, ఎన్‌డీపీఎస్ చట్టంలోని నిబంధనలు, డ్రగ్ పెడ్లర్ల పట్ల అప్రమత్తత, పీర్ ప్రెజర్‌ను అధిగమించే మార్గాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల బారిన పడి పునరావాసం పొందిన వ్యక్తులు తమ అనుభవాలను పంచుకోగా, విద్యార్థుల సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వై.వి. దాసేశ్వరరావు, డీన్లు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

తాజావార్తలు