సచివాలయ సిబ్బందిపై నిఘా

బెటాలియన్‌ కానిస్టేబుళ్ల తిరుగుబాటుతో సచివాలయ భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న టీజీఎస్పీ అధికారులు, కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేస్తూ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ సోమవారం మెమో జారీ చేశారు. సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బందిపై నిఘా ఉన్నదని హెచ్చరించారు. ‘ఏం చేస్తున్నారు..? ఎకడికి వెళ్తున్నారు..? ఎవరిని కలుస్తున్నారు..? ఎవరితో మాట్లాడుతున్నారు ? సోషల్‌ మీడియాలో ఏ పోస్టులు పెడుతున్నారు ? వంటి విషయాల మీద నిఘా ఉంటుంది’ అని పేర్కొన్నారు. ధర్నాల్లో పాల్గొనవద్దని, పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో 163 సెక్షన్‌ అమలులో ఉన్నది కాబట్టి, ధర్నాలు చేయొద్దని కుటుంబసభ్యులకు, బంధువులకు, మిత్రులకు, తోటి సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. సోషల్‌ మీడియాలో పోలీసులకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే తక్షణమే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

తాజావార్తలు