నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన తహసిల్దార్

 

 

 

 

పిట్లం,సెప్టెంబర్02,(జనం సాక్షి) వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల తహసిల్దార్ రాజ నరేందర్ గౌడ్ తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 6వ తేదీ వరకు జరిగే వినాయక నవరాత్రి ఉత్సవాలు,వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.మండల పరిధిలోని పటేల్ చెరువులో,పిట్లం గ్రామ వినాయకులు నిమజ్జనం కోసం వెళతాయని అందుకోసం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.వినాయక మండపం నిర్వహకులు తగు జాగ్రత్తలు పాటించి నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి రఘు,ఎస్ ఐ వెంకట్ రావ్,
పంచాయతీ కార్యదర్శి బలరాం,సిబ్బంది ఉన్నారు.